సమస్యలు గుర్తించి పరిష్కరిస్తాం ఆరో డివిజన్ పట్టణ ప్రగతిలో మేయర్ సామల బుచ్చిరెడ్డి మేడిపల్లి – జనంసాక్షి
స్థానిక సమస్యలను పట్టణ ప్రగతిలో భాగంగా గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో స్థానిక కార్పోరేటర్ తోటకూర అజయ్ యాదవ్ ఆద్వర్యంలో కాలనీవాసులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి పాల్గొన్ని డివిజన్‌లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. దశలవారీగా అన్ని ఇబ్బందులను దూరం చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ కురుమయ్య, డివిజన్ ఇంచార్జ్ ఎన్ లక్ష్మి, జలమండలి మేనేజర్ మమత, కాలనీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.