సమస్యల గుప్పిట్లో ప్రభుత్వ పాఠశాలలు

– నందిపాడు పాఠశాలలో సమస్యలు తిష్ట
– చెట్ల కిందనే పిల్లల చదువులు
– విద్యార్థులకు సరిపడా లేని గదులు
 అశ్వరావుపేట ఆర్ సి,  ఆగస్టు 23( జనం సాక్షి ) తెలంగాణ వస్తే విద్యార్థుల రాత మారినట్టే… అనుకున్న మనం దానికి విరుద్ధంగా కనిపిస్తోంది. చాలీచాలని ఉపాధ్యాయులతో ప్రభుత్వ విద్య విద్యార్థులకు అందని ద్రాక్షలా వేధిస్తుంది. గదులు సరిపడక చెట్ల కిందనే పాఠాలు బోధించడం  టీచర్లకు సవాల్ గానే మారింది. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు న్యాణ్యమైన విద్య అందించడంలో విఫలమవుతున్నారు. అశ్వరావుపేట మండలంలోని ఎంపీ యుపి పాఠశాలలో సమస్యలు తిష్ట  వేశాయి. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు విద్య మెరుగుపడే విధంగా నిధులు అందిస్తున్న  ప్రభుత్వం అక్కడ పనులు మాత్రం నత్త నడకనే కొనసాగుతున్నాయి. సరిపడ ని గదుల సమస్య ఏదిస్తున్న తరుణంలో ఉన్న గదులను మరమ్మత్తు చేయటానికి కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. ఆ పాఠశాలలో 110 మంది విద్యార్థులు ఉన్నారు. గదులు మాత్రం నాలుగు ఉండటంతో సరిపడక చెట్ల కిందనే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు  బోధిస్తున్నారు. నలుగురు ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులకు బోధించడం కష్టంగా మారిందని, ఖాళీగా ఉన్న నలుగురు ఉపాధ్యాయులను  వెంటనే భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణాలు జరపాలని కోరుతున్నారు. సమస్యలతో కూడిన చదువు విద్యార్థులకు కష్టంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యలు లేని చదువులు విద్యార్థులకు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.