సమస్యల పరిష్కారానికి కార్మికులు సంఘటితమవ్వాలి

కడప, జూలై 25 : సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సంఘటితమవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి శివశంకర్‌ పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు మౌలిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీరి సమస్యల పరిష్కారానికి కార్మికులతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. అంతేకాకుండా కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌, పనిభద్రత, పెన్షన్‌ వంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. వీటన్నీంటిపైన కార్మికులను సంఘటితం చేసి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.