సమస్యల వలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 17(జనం సాక్షి)
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్వే నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలియజేశారు, విద్యార్థులతో ప్రిన్సిపాల్ అప్పారావు , హెచ్ ఓ డి అభినవ్ వారు ఇద్దరు విద్యార్థులతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థులను బెదిరిస్తూ .వారి సమస్యలు విద్యార్థులు తెలియచేస్తే వారు వినిపించుకోకుండా దురుసుగా వ్యవహరిస్తూ మీరు ఏం చేసుకుంటారో చేసుకో అని విద్యార్థులపై వ్యవహరిస్తున్నారు, కళాశాలలో కనీసం ఆటో క్యాడ్ ,Beee, డ్రాఇంగ్ సంబంధించిన లెక్చరర్లు లేకపోవడం ద్వారా విద్యార్థులు వారి చదువులకు చాలా ఇబ్బంది అవుతుందని మరియు నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్లు లేకపోవడం బాధాకరమని దీని ద్వారా వారు చదువులకు దూరం అవుతున్నారని ఆమె మండిపడ్డారు , హాస్టల్లో బాత్రూమ్స్ లో చెడు దుర్వాసన వస్తున్న స్కావెంజర్స్ ని నియమించకపోవడం బాత్రూమ్స్ డోర్స్ లేకపోవడం, టైల్స్ ఉడిపడడం ఇలా అనేక సమస్యలతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులతో అమర్యాదగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్, మరియు హెచ్ ఓ డి ని సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు ,వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా చూసుకోవడానికి ఎవరు లేరు,వారికి ఒక డాక్టర్ నీ కేటాయించాలని ఆమె కోరారు .అనవసరం ఐనా చెట్లు హాస్టల్ కి అనుకొని ఉండడం ద్వారా కోతుల రావడం పిల్లల్ని కరవడం లాంటివి జరుగుతున్నవి అదే విధంగా పాముల బెడద ఉంది విటి కారణం గానే విద్యార్థులు ఇబ్బంది పడి హాస్టల్ నుంచివెల్లిపోవడం జరుగుతుంది, పేద విద్యార్థులు చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటే వారిని ఆర్థికంగా కూడా ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్క దానిపైన అదనంగా విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థుల వద్ద సేకరిస్తున్నారు ఈ సమస్యలను తట్టుకోలేక విద్యార్థులు ఇక్కడ చదువుకోమని టీసీలు పట్టుకునే పరిస్థితి రావడం ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమని దానికి పూర్తి బాధ్యత వహించి ఆయన పైనుంచి ఆయన తొలిగిపోవాలని హెచ్ ఓ డి అభినవ్ నీ సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కరించకపోతే ఉన్నత విద్యా మండలి ముట్టడిస్తామని ఆమె తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు తిప్పరపు రోహిత్,నగర కార్యదర్శి కంపెళ్ళి అరవింద్ ,పాల్గొన్నారు