సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

ఝరాసంగం అక్టోబర్ 16 (జనంసాక్షి) ఝరాసంగం మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి కొమారి గోపాల్ ఆధ్వర్యంలో సమాచార హక్కు రక్షణ చటం 2005 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 4 వసంతాలు పూర్తి చేసుకొని 5 వ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఝరాసంగమం ప్రభుత్వ ఆసుపత్రి ముందు కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో వైద్యాధికారి డా మజీద్ ఏ ఎస్సై మల్లేశ్వర్ చార్మినార్ జోనల్ ప్రెసిడెంట్ శివకుమార్ సభ్యులు రమేష్ చారి, బసంత్ రెడ్డి ,సురేష్, రామ్ శెట్టి ,యశ్వంత్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.