సమ్మెపై సర్కారును ఆదేశించలేం…చట్టవిరుద్ధమని ప్రకటించలేం..
ఆర్టీసీ కార్మికులకు దక్కని ఊరట కేసును లేబర్ కోర్టుకు బదిలీ చేసిన హైకోర్టు
• సమ్మెపై చర్చలకు ప్రభుత్వాన్ని కేసును లేబర్ కోర్టుకు
• సమ్మెపై చర్చలకు ప్రభుత్వాన్ని ఆదేశించలేమని వ్యాఖ్య
• జీతాల చెల్లింపు…సమ్మెపై ముగిసిన వాదనలు బదిలీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 18(జనంసాక్షి): ఆర్టీసీ సమ్మె వ్యవహారం లేబర్కోర్టుకు చేరింది. సమ్మెపై ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. లేబర్ కమిషనరకు సమ్మె వ్యవ హారాన్ని బదిలీ చేయాలన్న ప్రభుత్వ వాదనే నెగ్గింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం హైకోర్టులో జరిగిన విచారణ ముగిసింది. హైకోర్టు తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. పరిధి దాటి ముందుకు వెళ్లలేమని చెప్పిన హైకోర్టు రెండు వారాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. తమ నుండి ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఆర్టీసీ వ్యవహారంలో ప్రస్తుతం ప్రభుత్వం కార్మికులపై పై చేయి సాధించింది. ప్రభుత్వం మొదటినుండి ఈ కేసును కార్మిక శాఖ కమిషనర్ కు కేసును బదిలీ చేయాలని ఏ వాదనను వినిపిస్తోందో ఆ వాదన వైపే హైకోర్టు మొగ్గు చూపింది. పిటిషనర్ సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపి ఆర్టీసీకి నష్టం కలిగేలా చేస్తున్నాయని అఫిడవిట్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికి 45వ రోజుకు చేరింది. ఈ కేసు హైకోర్టు పరిధిలోకి రాదని కేసు లేబర్ కోర్టు పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై సోమవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు జారీ చేసింది. ఈ అంశాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని హైకోర్టు తెలిపింది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశించలేమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడింది. ప్రభుత్వంతో చర్చల కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరగా.. కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. 45 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధర్మాసనానికి వివరించారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతుందన్నారు. ప్రభుత్వం మాత్రం తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ యాక్సిడెంట్లు చేయిస్తుందని హైకోర్టుకు వివరించారు. ఈ విషయం లేబర్ కోర్టు చూసుకుటుందని, తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాకు కొన్ని పరిమితులు ఉన్నాయని, ఆ పరిధులను దాటి ముందుకెళ్లలేమని స్పష్టం చేసింది. రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తమనుంచి ప్రభుత్వానికి ఈ విషయంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, తాత్కాలిక డ్రైవర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్ ఓ రాజకీయ పార్టీ నేత ఇచ్చిన అఫిడవిట్ లో వుందని, పీఎఫ్ డబ్బులను అక్రమంగా వాడుకొని, కార్మికులను విధుల్లోకి తీసుకోమని ఎండీ ఎలా చెబుతారని ఆయన మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని, కమిటీ వేస్తే సమ్మెపై పునరాలోచిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఓ జేఎన్‌యూ చలో పార్లమెంట్ సక్సెస్ తీసుకోమని ఎండీ ఎలా చెబుతారని ఆయన మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని, కమిటీ వేస్తే సమ్మెపై పునరాలోచిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఓ రహస్య ఎజెండా వుందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కార్మికులందర్నీ విధుల్లోకి తీసుకోవాలని, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ‘పిటిషినర్ కోరిన దాని ప్రకారం.. తమ ముందు రెండు అంశాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడం. రెండోది కార్మికులను చర్చలకు పిలవమని ప్రభుత్వాన్ని ఆదేశించడం. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుంది. కార్మికులను రాష్ట్రపతి చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టుకు ఉందో లేదో చెప్పమని మొదటి నుంచి అడుగుతున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్ లో బస్సులు లేకపోయినా మెట్రోలో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. కానీ గ్రామాణ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం! – ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడిషినల్ అడ్వొకేట్ జనరల్ ( ఏజీ) వాదనలు వినిపించారు. ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె చట్టవిరుద్ధమని కోర్టుకు ఏజీ వివరించారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 22(1)ఏ, ప్రొహిబిషన్ ఆఫ్ స్టెక్ యాక్ట్ ప్రకారం సమ్మె ఇల్లీగల్ అని, చట్టం ప్రకారం ఆరు నెలల ముందు నోటీసులు ఇవ్వాలని, సమ్మెకు కనీసం 14 రోజుల ముందు ప్రభుత్వంకు తెలపాలని అన్నారు. కానీ కార్మికులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, సెక్షన్ 24 ప్రకారం కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ఏజీ హైకోర్టుకు తాగే వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్యక్రమంలో కార్పొరేషన్ పరిస్థితి అస్సలు బాగాలేదని, సమ్మె కారణంగా ఇప్పటి వరకు 44శాతం నష్టపోయినట్లు కోర్టుకు వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరపలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. యూనియన్లు విలీనం డిమాండ్ ను తాత్కాలికంగా పక్కకు పెట్టినా, తిరిగి ఏ క్షణమైనా ఆ డిమాండ్ ను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందన్నారు. కొతంమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం టీఎస్ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేశారని ప్రభుత్వం ఆరోపించింది. సమ్మె అన్నది కార్మికుల కోసం కాకుండా, యూనియన్ నేతలు తమ ఉనికి చాటుకునేందుకు చేస్తున్నారని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది.