సర్పంచ్,ఎంపిటిసి ని వెంటనే సస్పెండ్ చేయాలి
కోటగిరి ఆగస్ట్21(జనంసాక్షి): సుంకిని ఘటనకు కారకులైన సర్పంచ్,ఎంపీటీసీ,వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా. దళిత సంఘాల,దళిత మోర్చా అధ్యక్షుడు అశోక్ కాంబ్లే మాట్లాడుతూ…… సుంకిని గ్రామానికి చెందిన గంగాధర్ అనే దళితుని తన స్వంత స్థలం నుంచి ఖాళీ చేయించాలని,అతని భార్య పై స్థానిక ఎంపీటీసీ దాడి చేయడంతో ఆమె కంటికి గాయం కావడాన్ని చూసి మనస్తాపానికి గురైనా గంగాధర్ స్పీకర్ తనయుడు ముందే పురుగుల మందు త్రాగి ఆత్మహత్య యత్నం చేయడం జరిగిందని ఆయన అన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉన్న తన ఇంటి స్థలాన్ని లాక్కోవాలని చూసి గంగాధర్ అనే దళితుడి భార్య పై చేయి చేసుకున్న స్థానిక ఎంపీటీసీ సాయిలును,సర్పంచ్ మాధవరావు,తెరాస నాయకుడు షాజి పటేల్ పై వెంటనే చర్యలు తీసుకొని బాధితుడి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది.లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెగరి బాలు,దళిత మోర్చా కోటగిరి అధ్యక్షుడు బీమారావు,కార్యదర్శి గంగాధర్,సాయిలు,రమేష్,కాపుగాండ్ ల శ్రీను,నవీన్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.