సర్పంచ్​ ముందుకు రావడం అభినందనీయం : విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు వడ్ల పాండు రంగం చారి

పరిగి రూరల్​, అక్టోబర్​ 21 :
శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు సర్పంచ్​ బోయిన రాములు ముందుకు రావడం అభినందనీయమని విశ్వకర్మ సార్మ  త్వరగా పూర్తి చేద్దామని మాదారం గ్రామ సర్పంచ్​ బోయిని రాములు అన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో శుక్రవారం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ స్లాబ్​ పనులు సర్పంచ్​, విశ్వకర్మ సంఘం సభ్యులు ప్రారంభించారు.ఈ సందర్బంగా విశ్మకర్మ సంఘం వికారాబాద్​ జిల్లా అధ్యక్షులు వడ్ల పాండురంగాచారి మాట్లాడుతూ  ఆలయ నిర్మాణానికి సర్పంచ్​ బోయిని రాములు ముందుకు వచ్చి వేగంగా పనులు నిర్వహిస్తుండం చాలా సంతోసకరమన్నారు. అనంతరం విరాట్​ విశ్వకర్మ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు మాదారం శ్రీనివాస్ మాట్లాడుతూ  ఆలయ కంపౌడ్​ వాల్  నిర్మించేందుకు​ గ్రామానికి చెందిన అనంతగిరి సాయిరాం అనే దాత సహకరించడం సంతోషమన్నారు. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే మరింత బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.  ముందుకు రావడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరిగి కార్పెంటర్​ అసోషియేషన్​ అధ్యక్షులు వేణుగోపాల్​, మాదరం విశ్వ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటో రైటప్​ :
21 పిఆర్​ జి 01లో మాదారంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ స్లాబ్​ పనులు ప్రారంభిస్తున్నసర్పంచ్​ రాములు, విశ్వ బ్రాహ్మణులు
Attachments area