సర్పంచ్ పై పోలీసులకు పిర్యాదు చేసిన వార్డు సభ్యుడు

కుంట సదానందం
మల్హర్ జనంసాక్షి
మండల కేంద్రమైన తాడిచెర్ల మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ సుంకరి సత్యనారాయణ పై కొయ్యుర్ పోలీసులకు పిర్యాదు చేసినట్లుగా తాడిచెర్ల 12 వ వార్డ్ సభ్యుడు కుంట సదానందం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్డు సభ్యుడు కుంట సదానందం మాట్లాడుతూ ఉదయం వార్డు లోని పలు సమస్యలను పంచాయతీ కార్యదర్శికి విన్నవించుకునేనందుకు పంచాయతీ కార్యాలయనికి వెళ్లిన క్రమంలో నాపై సర్పంచ్ సుంకరి సత్యనారాయణ మద్యం సేవించి ఇష్టానుసారంగా దుర్భాశలాడుతూ కుర్చీని విసిరి బూతులు తిట్టడాని వార్డు సభ్యుడు కుంట సదానందం వాపోయాడు సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కొయ్యుర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లుగా తెలిపారు.