సర్వసభ్య సమావేశం నిర్వహించి లోపాలపై చర్చించాలి.

వాసవి నిత్య అన్నదాన సత్రం పరిరక్షణ సమితి అధ్యక్షులు గర్రి పల్లి ప్రభాకర్.

సిరిసిల్ల. సెప్టెంబర్ 12. (జనం సాక్షి). తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన సత్రం సర్వసభ్య సమావేశం నిర్వహించి లోపాలపై చర్చించారని శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సత్రం పరిరక్షణ సమితి నాయకులు గర్రి పళ్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్ల విలువైన ఆస్తులు కలిగిన సత్రం నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నాయని ఆరోపించారు. దాతల విరాళాల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఆప ధర్మ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించిన ఎగిన మురళి మరణించిన అనంతరం ప్రాతినిధ్యం లేకపోవడంతో అనేక లోపాలు ఉత్పన్నమయ్యాయి అన్నారు. సర్వసభ్య సమావేశం నిర్వహించకపోవడం వల్ల లోపాలపై చర్చించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని గర్రిపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు