సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతాం..
2 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్
పనులను ప్రారంభించిన మంత్రి గంగుల
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
కరీంనగర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ పేర్కొన్నారు
కరీంనగర్ -రామగుండం బైపాస్‌లో ఏర్పాటు 2కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసే సెంట్రల్ లైటింగ్‌తో ఆ రోడ్డు జిగేల్‌మంటోందని మంత్రి వెల్లడించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్య లు తీసుకుంటున్నామని, సెంట్రల్ లైటింగ్ వల్ల కొత్త శోభ వచ్చిందని పేర్కొన్నారు. అలాగే రాత్రిళ్లు ప్రమాదాలు జరగకుండా ఈ లైట్లు ఉపయోగపడుతాయన్నారు. బైపాస్ రోడ్డును పూర్తి జాతీయ రహదారిగా అభివృద్ధి చేశామన్నారు. గత ఎనిమిదేళ్ల కాలంలో చేపట్టిన పనులు పూర్తి అవుతుండడంతో నగరం రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్‌రావు, క
ఈ కార్యక్రమంలో కమీషనర్ సేవ ఇస్లావత్ ,కార్పొరేటర్లు జంగిలి ఐలేందేర్ యాదవ్ ,చల్ల హరిశంకర్ ,మేచినేని అశోక్ రావు ,పవన్ కుమార్ నేతి రవి వర్మ పాల్గొన్నారు