సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని… ఇన్స్ పెక్టర్ ఆత్మహత్య
మధ్యప్రదేశ్
తాను ఏమనుకున్నాడో ఏమో.. మధ్యప్రదేశ్ లో ఓ పోలీసు ఇన్ స్పెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు తన సర్వీసు రివాల్వర్ నే వినియోగించుకున్నాడు. మధ్యప్రదేశ్లోని సుంగ్రాలీ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి.
కొత్వాలిలో ఇన్ స్పెక్టర్ గా ఆర్ ఎస్ భదోరియా(58) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఆదివారం రోజంతా ఇంటికి వెళ్ళలేదు. అయితే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పోలీసు స్టేషన్ లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ లో కలకలం రేగింది.
తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన ఇన్ స్పెక్టర్ అక్కడిక్కడే మృతి చెందారు. ఎస్పీ డీకే చక్రవర్తి హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు గానీ, కుటుంబ సభ్యులుగానే తెలపడానికి ఇష్టపడడం లేదు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.