సర్వే నెంబర్ 83 లోని భూములకు పట్టాలిచ్చి రైతులకు ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి

 

డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

 

అచ్చంపేట ఆర్సి అక్టోబర్ 15 (జనం సాక్షి న్యూస్ ): నియోజకవర్గంలో ని లింగాల మండలం రాయవరం ,క్యాంప్ రాయవరం ,వడ్డె రాయవరం, గ్రామాల రైతుల వ్యవసాయ భూములను ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ భూముల సాకుతో రైతుల నుంచి వారి భూములను స్వాధీనం చేసుకోవాలనుకోవడం హేయమైనా చర్య అనడం దుర్మార్గమని డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగాల మండలం క్యాంప్ రాయవరం ,రాయవరం, వడ్డే రాయవరం, గ్రామాల పరిధిలోని సుమారు 400 మంది రైతుల కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటున్న వారి భూములను ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా ఫారెస్ట్ ల్యాండ్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడాన్ని కాంగ్రేస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సర్వేనెంబర్ 83 లో సుమారు 1398.10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన రైతులు గత 50 సంవత్సరాలుగా పొజిషన్ లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఆ భూముల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు.ఇదే క్రమంలో ఫారెస్ట్ అధికారులు ఉన్నపళంగా ఇలా రైతుల భూములను ఫారెస్ట్ భూములని భయబ్రాంతులకు గురిచేయడం దౌర్జన్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. 2018 సంవత్సరం లో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ,స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తో కలిసి ఇదే సర్వే నెంబర్ 83 లోని భూములకు సంబంధించిన రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని కావున ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు.అదే విదంగా అమ్రాబాద్ మండలంలోని రైతుల భూములకు ఇబ్బందులు పెట్టొదని, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు వివిధ రకాల కారణాలతో రైతుల భూములకు ఆటంకాలు కలిగిస్తూ వారి నుండి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే మా నాయకుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతుల కోసం ధర్నా, రాస్తారోకో,అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు.