సలేశ్వర తీర్థానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: చైత్ర పౌర్ణమి నేపథ్యంలో శ్రీశైలం సమీపంలోని సలేశ్వర తీర్థంలో జరుగనున్న జాతరకు నగరం నుంచి ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి సలేశ్వర తీర్థానికి ఈ నెల 3 నుంచి 6 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఎంజీబీఎస్ నుంచి సలేశ్వర తీర్థానికి రోజూ 15 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి.