సవాళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు కొత్త రూపు: జైట్లీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 : ప్రజలకు సుపరిపాలన అందించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. రాయితీలు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అర్హులకు రాయితీలు అందించేందుకు రాయితీలను హేతుబద్ధీకరిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ప్రత్యక్ష నగదు బదిలీకి పెద్దపీట వేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోటి మంది లబ్దిదారులను 10.3 కోట్లకు పెంచుతామన్నారు. బడ్జెట్‌ తరవాత ఆయన విూడియాతో మాట్లాడారు. ఎన్నో సవాళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు కొత్త రూపు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లోక్‌సభలో ఉదయం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జైట్లీ సాయంత్రం విూడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్టాల్ర మధ్య సంబంధాలపై భారీ కసరత్తు చేశామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. కేంద్రం నుంచి రాష్టాల్రకు 62 శాతం నిధులు ఇస్తామన్నారు. ప్రపంచమంతా భారత్‌వైపే ఆసక్తిగా చూస్తోందన్నారు. జీడీపీ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం అంచనా వేశామని తెలిపారు. తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధిలో రాష్టాల్రదే ప్రధాన పాత్ర అని పేర్కొన్నారు.  కేంద్ర, రాష్టాల్ర మధ్య సంబంధాలపై భారీ కసరత్తు చేశామని, కేంద్రం నుంచి రాష్టాల్రకు 42 శాతం నిధులు అందుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. దేశాభివృద్ధిలో రాష్టాల్రదే ప్రధాన భూమిక అన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఎన్నో సవాళ్లను దృష్టిలో పెట్టుకుని బ్జడెట్‌కు కొత్త రూపు ఇచ్చామని, తయారీ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చామని జైట్లీ చెప్పారు. జీడీపీ వృద్ధిరేటు 8 నుంచి 8.5 శాతం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచమంతా భారత్‌వైపే ఆసక్తిగా చూస్తోందని జైట్లీ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయించలేదు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. విభజన హావిూలను రెండు రాష్టాల్ల్రో అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌ ఐఐటీకి రూ. 55 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి రూ. కోట్లు, కేటాయించారు. కుతుబ్‌షాహీ టూంబ్స్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు.