*సస్యరక్షణ చేపడితే రైతులకు అధిక లాభాలు*
*దేశీయ ట్రైనర్ సురేష్ గౌడ్*
ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 25 రైతులు పండించే పంటలు సస్యరక్షణ చేపడితే అధిక లాభాలు వస్తాయని సురేష్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని బీచుపల్లి ఆయిల్ ఫీల్డ్ నర్సరీలను జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి డీజే ట్రైనర్ సురేష్ గౌడ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు ఆయిల్ ఫామ్ తోటల పెంపకం వల్ల ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పంటల వల్ల రైతులు అధిక దిగుబడులు గురించి లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల అధిక లాభాలు పొందొచ్చు అని ఆయన అన్నారు. అనంతరం కొండపేట, యక్త పురం గ్రామాలలో రైతులు వేసిన వరి, పత్తి పంటలను పరిశీలించారు. పంటలలో చీడపీడల నివారణ, సాగులో అధునాతన పద్ధతులు పై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేశీయ డీలర్లు,రైతులు తదితరులు పాల్గొన్నారు.