సహకార భవనాన్ని ప్రారంభించిన పోచారం

కామారెడ్డి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): జిల్లాలోని తాడ్కోల్‌ గ్రామంలో రూ. 26 లక్షలతో నిర్మించిన సహకార సంఘం వ్యాపార సముదాయపు భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.టీఆర్‌ఎస్‌ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని తాడ్కోల్‌ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ లో చేరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూతెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్‌ అథావలే ప్రశంసల వర్షం కురిపిండమే ఇందుకు నిదర్శనమన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకట్టుకునే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు, దివ్యాంగులు, యువత, బడుగు, బలహీన వర్గాలకు అద్భుతమైన పథకాలను తీసుకొచ్చారని ఆయన కొనియాడారు.రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, విత్తనోత్పత్తి పథకాలను ఎక్కడా అమలు చేయడం లేదన్నారు.