సాదా సీదాగా మండల సర్వసభ్య సమావేశం
గుడిహత్నూర్: సెప్టెంబర్ 30 (జనం సాక్షి) స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది ఎంపీపీ భరత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు అనంతరం ప్రతి సర్వసభ సమావేశంలో మిషన్ భగీరథ నీటి సరఫరా విషయమై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ హర్కాపూర్,సొయంగూడ సర్పంచులు ఏఈ ఆదిత్యను నిలదీశారు విద్య వైద్య రెవెన్యూ మహిళా శిశు సంక్షేమ పశువైద్య శాఖలు అధికారులు తమ శాఖల ద్వారా గత మూడు నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు మండల వైద్య అధికారి నీలోఫర్ వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తుండగా గ్రామంలోని సబ్ సెంటర్లు నిర్వహణ లేక ఆన్కాక్రాంతంగా మారుతున్నాయని వైద్య సిబ్బంది స్థానికంగా ఉండకపోవడంతో రోగుల సరైన వైద్యం అందటం లేదని శాంతాపూర్ సర్పంచ్ తిరుమల గౌడ్ సమస్యను వైద్యాధికారి దృష్టికి తీసుకువచ్చారు సబ్ సెంటర్లలో పరిస్థితిని సమీక్షించి సమస్యలను పరిష్కరిస్తానని వైద్యాధికారి జవాబు ఇచ్చారు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యుత్ స్తంభాలు వేయించాలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు ఏఈ గౌతమ్ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సంధ్యారాణి జెడ్పిటిసి పతంగి బ్రహ్మానంద్ ఎంపీపీ భరత్ ఎంపీడీవో సునీత సహకార సంఘ చైర్మన్ సంజీవ్ ముండే కో ఆప్షన్ సభ్యుడు షేక్ జమీర్ ఏపిఓ లింగయ్య ఎంఈఓ నారాయణ ఎంపిటిసిలు సర్పంచులు ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారుల