*సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం.

*బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు చదువు రాంచంద్రారెడ్డి.
మొగుళ్ళపల్లి (జనంసాక్షి)డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణే  లక్ష్యంగా అడుగులు వేస్తూ పనిచేస్తున్న బిజెపితోనే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు చదువు రాంచంద్రారెడ్డి  అన్నారు. సోమవారం15వ రాష్ట్రపతిగా పార్లమెంట్ సెంటర్ హాల్ లో నిర్వహించే  ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు చెవ్వ శేషగిరి యాదవ్ నేతృత్వంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంనకు చేరుకుని నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉన్న చిత్రపటాన్ని  మండల పరిషత్ కార్యాలయంలో ఉంచారు. అనంతరం రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్యమే లక్ష్యంగా.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని  మైనార్టీ, గిరిజన, దళిత వర్గాలకు అవకాశం ఇచ్చి సామాజిక న్యాయానికి బాటలు వేయడం జరిగింది అని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన చేస్తూ.. దొరల గడీలల్లో తెలంగాణను బంధీ చేసి,  తెలంగాణ సంపదను, వనరులను నిలువెత్తు దోచుకుంటూ.. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీని   బంగాళాఖాతంలో కలిపి బిజెపిని ఆదరించాలని, సామాజిక న్యాయం పాటిస్తున్న బిజెపి నాయకత్వాన్ని బలపరిచి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీని అధికారంలోకి వచ్చేలా ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మోరే రవీందర్ రెడ్డి, లోకుల బోయిన తిరుపతి, బండారి శ్రీనివాస్, పసరగొండ శివ తదితరులు పాల్గొన్నారు.
Attachments area