సాముల నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 18 (జనం సాక్షి): హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రాంరెడ్డి తండ్రి నాగిరెడ్డి గత రెండు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందారు. హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామంలో సాముల రాంరెడ్డి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబం ను నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ ఉస్తెల గుర్వారెడ్డి కి ఇటీవల డెంగీ జ్వరం రావడంతో వారి ఇంటికి వెళ్ళి అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు చేయించుకోవాలని సూచనలు చేశారు. ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట హుజూర్ నగర్ పట్టణ, మండల పార్టీ అధ్యక్ష్యులు తన్నీరు మల్లిఖార్జున రావు, చెక్కర వీరారెడ్డి, ఉస్తేల సైదిరెడ్డి, వీర నాగిరెడ్డి, ఉసైల శ్రీనివాస రెడ్డి, సిగతల వెంకటరెడ్డి, ఆదూరి కిషోర్ రెడ్డి, బచ్చల కూరి బాబు, గురవయ్య, ఎల్లారెడ్డి, సక్రు నాయక్, పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.