*సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ,  ఎమ్మెల్యే  మున్సిపల్ చైర్మన్  జిల్లా ఎస్పీ , డీ ఎస్పి **

 

*పట్టణ ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో  సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం*

గద్వాల ఆర్ సి.(జనం సాక్షి) ఆగస్ట్ 16,
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా …..ఈ రోజు సామూహిక జాతీయ గీతాలాపన జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉ.11.30 గంటలకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేసి ట్రాఫిక్ జంక్షన్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, బ్యాంకులు, విద్యాసంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లలో ఎక్కడివారక్కడ జాతీయ గీతాలాపన చేయాలని ప్రభుత్వం ఆదేశల మేరకు జోగులాంబ గద్వాల  జిల్లా కేంద్రంలో విజయవంతం చేశారు.ఈ కార్య క్రమంలో గద్వాల పట్టణం లోని ధరూర్,మెట్టు కృష్ణా రెడ్డి బంగ్లా, గాంధీ చౌక్, వై ఎస్సార్ సర్కిల్ , క్రిష్ణవేణి చౌక్ వివిధ సర్కిల్ సెంటర్ లలో బీరెల్లి చౌరస్తా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతాలలో నిర్వహించి సామూహిక జాతీయ గీతాలాపన స్వచ్ఛందంగా పాల్గొని ప్రజలందరూ విజయవంతం చేశారు. అలాగే గద్వాల పట్టణ కౌన్సిలర్ లో దుకాణ దారులు ఎక్కడి వారు ఒక్కడే నిలబడి గీతాలాపన
చేశారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులు, కలిసికట్టుగా పాల్గొనడం జరిగింది. కుల మత లకు అతీతంగా అందరు పాల్గొన్నారు.ప్రతిచోట ప్రతి సర్కిల్లో గద్వాల పట్టణంలో నిర్దేశించిన ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనలతో పోలీస్ సిబ్బంది లతో కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. వివిధ పార్టీ నేతలు కార్య కర్తలు, పాల్గొన్నారు