సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ తన జోరు కొనసాగిస్తున్నది. 119 స్థానాలకు గాను 91 స్థానాల్లో టీఆర్ఎస్ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నది. దీంతో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు 3.45 గంటలకు కేసీఆర్ చేరుకుని అనంతరం విలేకరులతో మాట్లాడుతారు.