సాయుధపోరాట వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుందాం.

తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జి. మంతటి గోపి మాదిగ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్26 (జనంసాక్షి):

భూమి కోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వాముల గడీలపై రోకలెత్తి తొలి భూ పోరాటానికి నాంది పలికిన సాయిధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ దండోరా నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ దండోరా నాగర్ ర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట సమయంలో రజాకార్లు,దేశముఖ్ లు భూస్వాములు తనఇంటిని తగలబెట్టి తాను పండించిన పంటను ఎత్తుకెళ్తుంటే ఆంధ్రమహాసబ సహకారంతో వారిపై దండెత్తి తరిమికొట్టి సాయుధపోరాటానికి స్ఫూర్తిని రగిలించిందని వారి తెగువను కొనియాడారు.తొలి బూపోరాటానికి నాంది పలికి భూమిలేని నిరుపేదలకు సాయుధ పోరాట దశలో 10 లక్షల ఎకరాల భూమిని పంచేందుకు శ్రీకారం చుట్టారని వారి సేవలను గుర్తుచేసుకున్నారు.నేటి తరానికి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలియజేయాల్సి న అవసరం ఎంతైనా వున్నదని అభిప్రాయ పడ్డారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేణుక మాదిగ,తెలంగాణ దండోరా రాష్ట్ర నాయకులు చుక్క వెంకటస్వామి, నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షులు భీమయ్య మాదిగ,బాలయ్య, లక్ష్మయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.