సింగరేణి ఉద్యోగులకు ఉత్పత్తి ప్రోత్సాహకాలు….

బహుకరించిన జియం ఎం సాలెము రాజు….
ఇల్లందు (జనం సాక్షి) 8 జూలై    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా   ఇల్లందు ఏరియా జెకె ఓపెన్ కాస్ట్ లో 2021,22 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి కంటే 125 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినందుకు గాను ఉద్యోగులకు ఏరియా జియం ఎం షాలేము రాజు ఈ సోమవారం రోజు జె.కె.5 ఒసిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉత్పత్తి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా జియం మాట్లాడుతూ జెకె 5 ఓపెన్ కాస్ట్ ఉద్యోగులు కరోనా కష్టాలు ఎదుర్కొని 125 శాతంతో బొగ్గు ఉత్పత్తి చేసి ఇల్లందు ఏరియాను ప్రథమ స్థానంలో నిలుపడానికి ఎంతో కృషి చేశారన్నారు. అందుకు గాను గుర్తింపు సంఘం అభ్యర్ధన మేరకు ప్రతి ఉద్యోగికి ఒక బహుమతి ఇవ్వాలని నిర్ణయంలో భాగంగా ఈ ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ ఆర్ధిక సంవత్సరం కూడా ఇదే స్ఫూర్తితో ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని కోరారు.
   ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణ అధికారి పంజాల శ్రీనివాసు, మేనేజర్ పూర్ణచందర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ చిన్నయ్య, డిజిఎం పర్సనల్ జీవి మోహన్ రావు, సీనియర్ పర్సనల్ అధికారి గుర్రం శ్రీహరి, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు ఎస్ రంగనాథ్, ఫిట్ కార్యదర్శి సంజీవరావు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు