సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకుల డిమాండ్
పినపాక నియోజకవర్గం ఆగష్టు 26 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 22 గెజిట్ విడుదల చేసి సింగరేణిలో అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కార్యాలయం ముందు సింగరేణి కాంటాక్ట్ కార్మికులు కొద్దిసేపు బైఠాయించారు అనంతరం స్థానిక జడ్పిటిసి పోశం నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్యక్రమానికి ముందు అంబేద్కర్ సెంటర్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా తయారయిందని ఒక కార్మికుడు మరణిస్తే ఇటు యాజమాన్యం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం గానీ పట్టించుకునే స్థితిలో లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తుండగా కేసీఆర్ ప్రభుత్వం కేవలం 11 వేల మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేయడం సబబు కాదని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలన్నారు. లేని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగల కాంట్రాక్ట్ కార్మికులు ఓబీ వర్కర్లు సెప్టెంబర్ 9 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు ఎం నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా జేఏసీ రాష్ట్ర నాయకులు బి మధు, ఆర్ మధుసూదన్ రెడ్డి, ఎండీ గౌస్, గౌని నాగేశ్వరరావు, గద్దల శ్రీను,ఆర్ లక్ష్మీనారాయణ, అక్కి నరసింహారావు,వెలగపల్లి జాన్, మంగీలాల్ పూసల భద్రం కాంట్రాక్ట్ కార్మికులు సంజీవ రావు, టి భద్రం,వెంకటేశ్వర్లు బత్తుల లక్ష్మణ్, ప్రసాద్, సంజీవరెడ్డి, జానయ్య,కృష్ణయ్య, కరుణాకర్, గురుమూర్తి, ఆనంద్, కామేశ్వరరావు, వెంకన్న ,శ్రీనివాస్, వేణు, శ్రీనివాస రావు, రంగారెడ్డి, రామారావు తాటి వెంకటేశ్వర్లు, రాము, ప్రవీణ్,నాగమణి, స్వరూప రాణి, ఇమాంబి, ఎల్లమ్మ, ఉపేంద్ర, అచ్చమ్మ, ఇతరులు పాల్గొన్నారు.