సింగరేణి కార్మికుడి ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌, జనంసాక్షి: అనారోగ్యం కారణంగా భార్యతో సహా సింగరేణి కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌ భగత్‌నగర్‌లో చోటు చేసుకుంది. దంపతుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.