సింగూరు రైతులదే విజయం

4

– ప్రైవేటు భూసేరణ ప్రజాప్రయోజనాల కిందకిరాదు

– పరిహారాన్ని రైతులు తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు

– సుప్రీం సంచలన తీర్పు

– మమత హర్షం

కోల్‌కతా,ఆగస్టు 31 (జనంసాక్షి):టాటా కార్ల కంపెనీకి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నానో కార్ల ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్‌ లోని సింగూరులో

కేటాయించిన 997 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చెయ్యాలని ఆదేశించింది. రైతులకు చెల్లించిన పరిహారాన్ని తిరిగి తీసుకోవద్దని స్పష్టం చేసింది. టాటా కంపెనీ లక్ష రూపాయలకే కారు ఇస్తామని ప్రకటించి నానో కార్ల ఉత్పత్తి కోసం సింగూరులో ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. దీనికి 2006లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను సేకరించింది.టాటా కార్ల కంపెనీకి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నానో కార్ల ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్‌ లోని సింగూరులో కేటాయించిన 997 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చెయ్యాలని ఆదేశించింది. రైతులకు చెల్లించిన పరిహారాన్ని తిరిగి తీసుకోవద్దని స్పష్టం చేసింది. టాటా కంపెనీ లక్ష రూపాయలకే కారు ఇస్తామని ప్రకటించి నానో కార్ల ఉత్పత్తి కోసం సింగూరులో ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. దీనికి 2006లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను సేకరించింది.ఐతే, వెస్ట్‌ బెంగాల్‌ పేరు మార్చాలని తాము భావించినందుకే ఈ విజయం దక్కిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. సుప్రీం తీర్పు పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తన కల నెరవేరిందని, ఇక ప్రశాంతంగా చనిపోవచ్చన్నారు. దుర్గా పూజ లాగా సింగూర్‌ ఉత్సవ్‌ నిర్వహిస్తామన్నారు.     సింగూరు భూములపై  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. వివాదాస్పద సింగూరు భూముల  ఒప్పందం కేసులో సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఆమె విూడియాతో మాట్లాడారు. తనతో పాటు సింగూరు ప్రజలు ఈ తీర్పు కోసమే ఎదురు చూస్తున్నామన్నారు. ఇక ఇప్పుడు తాను ప్రశాంతంగా కన్నుమూయవచ్చని మమతా ఉద్వేగంగా అన్నారు. కాగా టాటా నానో ప్లాంట్‌ ఏర్పాటు కోసం 2006లో నాటి వామపక్ష ప్రభుత్వం సింగూరు ప్రాంతంలో వెయ్యి ఎకరాల భూమి కేటాయించిన విషయం తెలిసిందే. రైతుల పొలాలను ప్లాంటు ఏర్పాటు కోసం కేటాయించడంపై అప్పట్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది.