సిఎం జగన్‌తో కేంద్రబృందం భేటీ
పంటనష్టాలపై చర్చించిన అధికారులు
త్వరగా సాయం అందేలా చూడాలని కోరిన ప్రభుత్వం
వివరాలు వెల్లడించిన మంత్రి కన్నబాబు
అమరావతి,నవంబర్11(జనంసాక్షి): ఎపిలో వరదల వల్ల పంటనష్టాన్‌ఇన అంచనా వేసిన అనంతర్ కేంద్ర బృందం సిఎం జగన్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్బంగా సిఎం కూడా పంటలకు సంబంధించిన వివరాలను తెలియచేశారు. క్యాంపు కార్యాలయంలో కేంద్ర ¬ంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరప్ రాయ్ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటి అయ్యింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో సీఎస్ నీలం సహని, ¬ంమంత్రి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన పంట తీవ్రతను కేంద్ర బృందానికి సీఎం వివరించారు.భేటీ అనంతరం మంత్రి కన్నబాబు విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృంద సభ్యులు.. సీఎం వైఎస్ జగన్‌తో భేటి అయ్యారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో వారు చూసిన అనుభవాలను సీఎంకు వారు వివరించారని తెలిపారు. జులై నుంచి వర్షాలు ఎక్కువగా కురవడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రధానంగా వరి, వేరు శనగతో పాటు అనేక పంటలు దెబ్బతిన్నాయని సీఎం బృందానికి వివరించారన్నారు. రోడ్లు అక్వా చెరువులు సైతం దెబ్బతిన్నాయని, కేంద్రం నుంచి సహాయం అందించాలని ఆయన కోరినట్లు మంత్రి చెప్పారు. అంతేగాక పంట నష్టంపై తాను రాసిన లేఖకు వెంటనే స్పందించి కేంద్ర బృందాన్ని పంపిన ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ, అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. పంటల నష్టంపై వెంటనే రైతులను ఆదుకోవాలని ఆయన కోరారన్నారు. దేశ చరిత్రలోనే ఇన్‌పుట్ సబ్సీడీ ఏ నెలకు ఆనెల అందిస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని, అందువల్ల కేంద్రం సహకరించాలని కోరారని పేర్కొన్నారు. తాము చెప్పిన 8 వేల కోట్ల పైన నష్టాన్ని వాస్తవ పరిస్థితులు గానే భావిస్తున్నామని కేంద్ర బృంద సభ్యులు తెలిపారని, వీలైనంత త్వరగా సహాయం అందేలా చూస్తామని కేంద్ర బృందం హావిూ ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. వరి, వేరుశనగతో పాటు క్వాలిటీ తక్కువగా ఉన్న వాటిని సైతం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. జులై, సెప్టెంబర్ నెలల్లో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని, రైతు భరోసా కేంద్రాల్లో వారి పేర్లు సైతం డిస్ ప్లే చేయాలని సీఎం అధికారులకు ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.