సిఎం దళిత ద్రోహి, రాబంధు:శంకరరావు

హైదారాబాద్‌: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మాజి మంత్రి శంకరరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. సిఎం దళిత ద్రోహి, రాంబందు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. తనను మంత్రి మండలి నుంచి తొలిగించడం, ఉపముఖ్యమంత్రి దామెదర రాజనరసింహను అవమానించండంతో దళితులు కాంగ్రెస్‌ పార్టీకి దూరమయ్యారన్నారు.  సిఎం వైఖరి వల్ల దళితులు, మైనార్టిలు, మహిళలు పార్టీకి దూరమవుతున్నారని చెప్పారు.  ఓవైసీ సోదరులను పోలీసులను వేధించడంతో మైనార్టీలు దూరమయ్యారన్నారు. కాంగ్రెస్‌ ఎలాంటి సేవ చేయకపోయినా అధృష్టం కొద్ది కిరణ్‌ సిఎం అయ్యార్నారు. తాను ఏ తప్పు చేయకపోయినా గ్రిన్‌ఫీల్డ్‌ అంశంపై  తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై  సీబీఐ తో విచారణ జరిపించాలని ఆయన కోరారు.  ఎర్రచందనం స్మగ్లింగ్‌, డీజీపీ నియామకంపై కూడా సీబీఐ విచారణ జరిపించాలన్నారు.