సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనకు నిరసన వ్యక్తం చేసిన బిఎస్పి నాయకులు

అయిజ,జూన్ 18 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహం నందు డీఎస్పీ నాయకులు సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనకు నిరసన వ్యక్తం చేశారు మాట్లాడుతూ.దేశాన్ని నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వం, బహుజన సమాజ్ పార్టీ తాలూకా కోశాధికారి రజక వీరేశ్ మాట్లాడుతూ ,మొన్న కిషన్,నేడు జవాన్, మొన్న నల్ల చట్టాల పేరుతో రైతులను చంపినారు నేడు అగ్నిపత్ స్కీంతో జవాన్లను చంపినారు, నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం, అగ్నిపత్ పేరుతో కొత్త గా తీసుకొచ్చిన పథకం ఒక జవాన్ పాలిట శాపంగా మారింది,నిరసన తెలపడం నేరమైంది, సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి 13 మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది మృతి చెందిన కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలి గాయాలపాలైన వారికి వైద్య సహాయం అందించాలి ఈ పాపం బిజెపి దే, రద్దయిన అన్ని పరీక్షలను వెంటనే నిర్వహించాలి లేనిపక్షంలో బహుజన సమాజ్ పార్టీ వారి పక్షాన నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో,బీఎస్పీ సీనియర్ నాయకులు రాజరత్నం హనుమన్న లడ్డు భరత్ ఉదండపురం ఏసన్న సతీష్ బిసన్న తదితరులు పాల్గొన్నారు