సిద్దిపేట నియోజకవర్గానికి గురువా రెడ్డి చేసిన సేవలు మరువలేనివి – మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల-రాజనర్సు
సిద్దిపేట జిల్లా బ్యూరో (జనంసాక్షి) జూన్ 13 : సిద్దిపేట నియోజకవర్గానికి ఎడ్ల గురువారెడ్డి చేసిన సేవలు మరువలేనివని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజూల-రాజనర్సు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ సభ్యులు కొమరవెల్లి అంజయ్య అన్నారు. సోమవారం ఎడ్ల గురువారెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకొని విక్టరీ టాకీస్ చౌరస్తా వద్ద వారి కౌంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజం రజాకార్ల ఆగడాలు, అకృత్యాలు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారని, సంఘసేవకునిగా, శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యులుగా నీతి నిజాయితీ, నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా నిరాడంబర జీవితం గడిపి సిద్దిపేట ప్రాంతానికి అనేక వనరులు తీసుకొచ్చి తుది శ్వాస వరకు ఈ ప్రాంత అభివృద్ధికి అశేషమైన కృషి చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గానికి వారు చేసిన సేవలు మరువలేనివని, వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యులు డా”పాపయ్య, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్ల వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, సీపీఐ పట్టణ కార్యదర్శి బన్సీలాల్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, కనుకుంట్ల శంకర్, జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మన్నే కుమార్,పిట్ల మల్లేశం, కర్నాల చంద్రం, తవుసుపల్లి భిక్షపతి, పుల్లని వేణు, ఐలయ్య, ఆత్మకూరి హరిక్రిష్ణ,సుజిత్, ముత్యాల శంకరయ్య పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, సీపీఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Attachments area