సిపిఎల్‌కు చంద్రపాల్ దూరం
జమైకా,జూన్ 19 (జనంసాక్షి) :
సొంతగడ్డపై తొలిసారిగా జరుగుతోన్న ఐపీఎల్ తరహా టోర్నీ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌కు వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చంద్రపాల్ దూరమయ్యాడు. ఇంగ్లీష్ కౌంటీ టీమ్‌తో ఒప్పందం కారణంగా సిపిఎల్ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన డెర్బీషైర్‌కు చంద్రపాల్ ఆడుతున్నాడు. ఆ జట్టుతో ఉన్న కాంట్రాక్ట్ నిబంధనల కారణంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడలేకపోతున్నానని చెప్పాడు. సిపిఎల్ ఫ్రాంచైజీలతో ఒప్పందానికి ముందు అంగీకరించిన చంద్రపాల్ తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గాడు. అతని ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకున్న విండీస్ బోర్డ్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఆడకపోవడం నిరాశగా ఉందని , వచ్చే సీజన్ నుండి తప్పకుండా సిపిఎల్‌కు అందుబాటులో ఉంటానని చంద్రపాల్ తెలిపాడు. చంద్రపాల్ తప్పుకోవడంతో అతని స్థానంలో ఆస్టేల్రియా బ్యాట్స్‌మన్ ల్యూక్ పోమర్స్‌బ్యాచ్‌కు చోటు దక్కింది. 28 ఏళ్ళ ఈ ఆసీస్ క్రికెటర్ 48 టీ ట్వంటీల్లో 1078 పరుగులు చేశాడు. దీనిలో నాలుగు హాఫ్ సెంచరీలు , ఒక ్గ/సంచరీ ఉన్నాయి. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ , రాయల్ ఛాలెంజర్స్‌కు ఆడిన పోమర్స్‌బ్యాచ్ సొంతగడ్డపై బిగ్‌బాష్‌లో బ్రిస్బేన్‌హీట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ తరహాలోనే విండీస్ క్రికెట్ బోర్డ్ నిర్వహిస్తోన్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ జూలై 30న ప్రారంభం కానుంది.