సిపిఎస్ పెన్షన్ విధానానికి నిరసన ప్రకటించిన ఉపాధ్యాయులు
కుసుమంచి సెప్టెంబర్ 1. ( జనం సాక్షి ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సెప్టెంబర్ ఒకటవ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా మండల ఉపాధ్యాయులు నిరసన ప్రకటించారు. గురువారం రోజున జడ్పీహెచ్ఎస్ కూసుమంచి పాఠశాల యందు భోజన విరామ సమయంలో సిపిఎస్ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ సిపిఎస్ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ అమలయేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో యు ఎస్ పిఎస్ జిల్లా నాయకులు మండవ నరసయ్య, గంధసిరి మల్లయ్య, ఉపాధ్యాయులు ప్రభాకర్ రావు, రాణి, శ్రీనివాసరావు, సౌభాగ్యం, రవికుమార్ , బాబురావు తదితరులు పాల్గొన్నారు.