సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభ విజయవంతం చేయాలి: బి అయోధ్య
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 05 (జనం సాక్షి): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు హైదరాబాదులోని శంషాబాద్ లో నాలుగవ తేదీ నుండి ఏడవ వ తేదీ వరకు జరిగే మహాసభలకు పినపాక నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య చారి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభలను నిర్వహించబడుతోంది. మహాసభలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ డి రాజా ప్రారంభించనున్నారు. నాయకులు కార్యకర్తలు ప్రదర్శన నిర్వహిస్తారు. శంషాబాద్ జెడ్పి ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభ జరుగుతోంది. ఈనెల ఐదు నుంచి ఏడు వరకు మల్లికా కన్వెన్షన్ హాల్లో ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. సభలో పాలమూరు రంగారెడ్డి కాలేశ్వరం, ధరణి పోర్టల్ సమస్యలు, దళిత బంధు పథకం, నిరుద్యోగ భృతి, రాజకీయ కార్యాచరణ లాంటి ముఖ్యమైన 30కి పైగా అంశాలపై చర్చించి అనంతరం తీర్మానాలను ఆమోదించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మున్నా లక్ష్మీకుమారి సర్, సరెడ్డి పుల్లారెడ్డి జిల్లా సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ , పట్టణ కార్యదర్శి దుర్గాల సుధాకర్, జిల్లా సమితి సభ్యులు ఎస్కే సర్వర్ అక్కి నరసింహారావు కుటుంబరావు నాయకులు మంగి వీరయ్య, జక్కుల రాజబాబు ,బాడిస సతీష్, పినపాక మండలం నుండి జిల్లా సమితి సభ్యులు గడ్డం మనోహర చారి, పద్మనాభ రాజు తదితరులు ప్రతినిధులుగా మహాసభలో హాజరైనారు.