సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్
హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 10(జనంసాక్షి)అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ 24వ జాతీయ మహాసభకు మండలంలోని అన్ని ప్రాంతాల సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సిపిఐ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున అక్కెన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామంలో గోడ ప్రతులను అయన విడుదల చేశారు.గత 40 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ మహాసభలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు ఉత్సాహపూరిత వాతావరణంలో లక్షలాదిమందితో మహాసభలు జరుగుతున్నాయని, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరియు 25 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవెళ్లి మాజీ ఉప సర్పంచ్ కొమ్ముల పర్శరాములు, సీపీఐ నాయకులు కొమ్ముల పర్శయ్య, బైరి చిన్న రాజయ్య, కొమ్ముల చెంద్రయ్య, మజ్జిక ఎర్ర రాజయ్య, బండారు సంపత్, మజ్జిక రాములు, తటికాయల వెంకటయ్య, బజ్జిల రాజమౌళి, కొమ్ముల అనిల్, పుల్లూరి బాబు, జంగ రాజ్ కుమార్, అప్పాల సదానందం, కొమ్ముల రజినీకాంత్, మహిళా నాయకురాలు జంగ కనుకవ్వ, దాసరి రాధ తదితరులు పాల్గొన్నారు.