సిరిసిల్లతో ‘పోరు’తో పెనవేసుకున్న ‘పోగు’బంధం…

బిఎల్‌పి సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కూరపాటి రమేశ్‌

నేత కార్మికులను ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తున్న పాలకులు

బతుకమ్మ చీరలతో యజమానులకే లాభం

అన్ని రంగాల కార్మికులు ఆత్మగౌరవ నినాదంతో ఓటు వేయాలి

మార్పు సిరిసిల్ల నుండే మొదలుకావాలి

రాజన్నసిరిసిల్ల బ్యూరో, నవంబరు 23(జనంసాక్షి): ‘రెండు దశాబ్ధాల క్రితం సిరిసిల్ల రాజీవ్‌నగర్‌లో కుటుంబాన్ని కాపాడుకోలేని దయనీయ స్థితిలో కూల్‌డ్రింక్‌లో కన్నబిడ్డలకు పురుగుల మందు కలిపి ఇచ్చి కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాలు పోగొట్టుకున్న నేతన్న దయనీయ స్థితి నన్ను కదిలించివేసింది… నేతన్నల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి పోరాటం ద్వారానే హక్కులు సాధించేలా వారిని నడిపించాలని నిర్ణయంతో రెండు దశాబ్ధాలుగా సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలపై పోరుదారిలో పెనవేసుకున్న పోగుబంధం నాది…’

బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా సిరిసిల్ల నియోజకవర్గంలో బరిలో ఉన్న కూరపాటి రమేశ్‌ పరిచయం కోసం వెళ్లిన ‘జనంసాక్షి’తో అన్న