సిరిసిల్ల కేటీఆర్‌దే!
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెరాస ప్రభంజనం కొనసాగుతోంది. సిరిసిల్లలో తెరాస అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కె.కె. మహేందర్‌రెడ్డిపై కేటీఆర్ జయకేతనం ఎగురవేశారు. 2009 నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న కేటీఆర్.. 2010 ఉప ఎన్నికతో పాటు 2014 ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే గెలుపొందారు.