సిలిండర్‌ పేలి ఒకరి మృతి

ఖమ్మం, జనంసాక్షి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఓ వ్యక్తి శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.