*సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్*

బాల్కొండ: జూలై 30 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్ పూర్ గ్రామంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నిజామాబాద్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీలు ఇప్పుడున్న సభ్య సమాజంలో భారత రాజ్యాంగం ప్రకారం గా వారికి కల్పించిన హక్కుల విధంగా జీవించాలని సూచించారు అంటరానితనం అస్పృశ్యత వాటిని పూర్తిగా వ్యతిరేకించాలని వారు తెలిపారు ముఖ్యంగా అంటరానితనం అసలు కారణం అజ్ఞానంలో ఉండడమే అని వారికి సూచించారు అజ్ఞానానికి కారణం చదువు లేకపోవడమే కావున ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా ప్రోత్సహించాలని అలాగే ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా వసతి గృహాలు ఎన్నో ఉన్నాయని వారు తెలిపారు ఇలాంటి అవకాశాలన్నీ యువత సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అలాగే పోలీస్ శాఖ వారి తరఫునుండి ASI గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి జీవనవిధానాన్ని కల్పించాలని వారి పట్ల కులం పేరుతో గానీ ఇతర విషయాలలో దురుసుగా ప్రవర్తించకూడదని గొడవలు పెట్టుకోవద్దు అని అట్లా చేసినట్లయితే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి శిక్షకు అర్హులే అవుతారని వారు సూచించారు అలాగే యువత ఈ రోజుల్లో మద్యపానం ధూమపానం మాదక ద్రవ్యాలు అయినా గంజాయి కొకైన్ వాటికి బానిసై జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని అలాంటివారు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తే వాళ్లకు తగిన అవగాహన కల్పించి అలాంటి జరగకుండా చర్యలు చూసుకుని తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్, బాల్కొండ RI రాఘవేందర్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ లింగారెడ్డి, బాల్కొండ ASI రాజేశ్వర్, వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారి కృష్ణవేణి, టిఆర్ఎస్ నాయకులు గడ్చంద అనిల్, నీరడి గంగారాం, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, లిఫ్ట్ చైర్మెన్ రెడ్డి,వార్డు సభ్యులు గడ్చంద ప్రదీప్, ఎవరి నాగేష్ ,కుంట శేఖర్, గడ్డం రాజేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ ,యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.