సిసి కెమెరాలకోసం 8 లక్షల విరాళం

కరీంనగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): నేరాల చేదన నియంత్రణకు దోహదపడే సిసి కెమెరాల ఏర్పాటుకోసం నేను సైతం కార్యక్రమంలో బాగంగా కరీంనగర్‌గ్రానైట్‌ కటింగ్‌ మిషన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎనిమిది లక్షల రూపాయల చెక్కును పోలీస్‌కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డికి అందించారు. ఈసందర్బంగా కమలాసన్‌ రెడ్డి మాట్లాడుతూ సిసి కెమెరాల ఏర్పాటు కోసం నేనుసైతం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు బాగస్వాములు కావాలన్నారు. ఇటీవలి కాలంలో జరిగిన పలు నేరాలు సిసి కెమెరాల ఆదారంగా చేదించబడ్డాయన్నారు. కార్యక్రమంలో రూరల్‌ ఎసిపి తిరుపతి, రూరల్‌ సిఐ శశిదర్‌ రెడ్డిచ కొత్తపల్లి ఎస్‌ఐ రమేశ్‌ గ్రానైట్‌ కటింగ్‌ మిషన్‌ అసోసియేషన్‌ సభ్యులు శంకర్‌, అశోక్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.