సిసి రోడ్ల నిర్మాణ శిలాఫలకం శంకుస్థాపన చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు బ్యూరో,సెప్టెంబర్20(జనం సాక్షి):-
మంగళవారం ములుగు జిల్లా కేంద్రం లోని  బండారుపల్లి గ్రామ పరిధిలోని ఆర్ అండ్ బి రోడ్డు నుండి  మినీ స్టేడియం రోడ్డు వరకు అభివృద్ధి పరచుట,రోడ్డు  వెడల్పు కోసం పంచాయతీరాజ్ విభాగం 25 లక్షల నిధులతో మంజూరైన సిసి రోడ్ల నిర్మాణం శిలాఫలకం శంకుస్థాపన జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్,జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, ఐటిడిఎ పిఓ అంకిత్ లతో కలసి  రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేసారు.ఈ కార్యక్రమములో జెడ్పి వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య,ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి,ఎంపిటిసి ఇండ్ల సుజాత,బండారుపల్లి సర్పంచ్ అక్కల రగోతం సంబంధిత అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.