సీఆర్‌ఆర్ తగ్గింపు.. రెపో రేటు యథాతథం
ఆర్‌బీఐ గవర్నర్
ముంబయి, అక్టోబర్ 30(జనంసాక్షి):
నగదు నిల్వల నిష్పత్తిని (సిఆర్‌ఆర్) 25బేసిక్ పాయిం ట్లు తగ్గిస్టున్నట్టు ఆర్‌బిఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. మంగళ వారంనాడు ఆయన రిజర్వు బ్యాంకు పరపతి విధాన సమీక్ష అనంతరం పై విధంగా ప్రకటించారు. దీంతో నగదు నిల్వల నిష్పత్తి 4.25శాతానికి చేరుకుందని
వెల్లడించారు. సిఆర్‌ఆర్ తగ్గింపు వల్ల 17,500 కోట్ల రూపాయల మేర బ్యాంకులకు నగదు నిల్వ సమకూరనున్నట్టు తెలిపారు. రెపోరేటును యథాతథంగా ఉంచుతున్నామని తెలిపారు. వడ్డీ రేేట్లు యథాతథంగా కొనసాగుతాయని ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ది రేటు 5.8శాతానికి పరిమితమవుతుందని చెప్పారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 7.5శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సానుకూల ధోరణితోనే ఆర్‌బిఐ నిర్ణయాలు తీసుకున్నదన్నారు. ప్రస్తుత కేంద్ర ఆర్థిక విధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆర్‌బిఐ తాజా నిర్ణయంతో స్టాక్ మార్కెట్‌లో నష్టాలు చోటు చేసుకున్నారు. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆర్‌బిఐ ప్రకటనతో నష్టాల బాట పట్టాయి. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో సెన్సెక్సు 140 పాయింట్లు పడిపోగా.. నిఫ్టి 40 పాయింట్లు నష్టాల్లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.