సీఎం కెసిఆర్ నాయకత్వంలో

‘అభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ’
-ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్
 జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్.
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 16 జనం సాక్షి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత 75 వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ పాలకుల కబంధహస్తాల నుండి విముక్తి తర్వాత ఊపిరి పీల్చుకుందన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ర్రాష్టాన్ని దేశంలోనే అగ్ర పతన నిలిపాడని అన్నారు. సీఎం దూరదృష్టతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుంది అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కేసీఆర్ సర్కారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని కొనియాడారు. జాతీయ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం పౌరులుగా మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరగనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు
 ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాతే తెలంగాణఅభివృద్ధి
   పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అభివృద్ధి పెరిగింది అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలులో లేని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ ప్రవేశపెడుతుందని కొనియాడారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండేవని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు వివిధ రకాల సంక్షేమ పథకాలు అనుభవిస్తూ ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం మన అందరి అదృష్టమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పట్టణంలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బంజారా యువతులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో వీరిని సభా వేదికపైకి పిలిచి ఎమ్మెల్యే, ఎంపీ ఇతర అధికారులు వారితో కలిసి ఫోటోలు దిగారు.
 కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమౌళి, స్థానిక ఆర్డిఓ శ్రీను నాయక్, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అగ్ర పతాన దూసుకు వెళుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని వారు తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకొని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదిగి, తమ తల్లిదండ్రులకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలకి నియోజకవర్గంలోని ఆయా మండలాలలో నుంచి వచ్చిన పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవి గౌడ్, జడ్పిటిసి ఉషా గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్లు, నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు, సొసైటీ చైర్మన్లు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు, ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.