సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి…

– 13వ రోజుకు చేరిన నిలవధిక సమ్మె.
– తమగోడు ప్రొఫెసర్ జయశంకర్ కు విన్నవించిన వీఆర్ఏలు.
– మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య.
ఊరుకొండ, ఆగస్టు 6 (జనం సాక్షి):
వీఆర్ఏలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఊరుకొండ మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య డిమాండ్ చేశారు. శనివారం వీఆర్ఏల 13 వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ సత్తయ్య మాట్లాడుతూ వీఆర్ఏ లకు పే స్కేల్ జీవోను వెంటనే చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఊరుకొండ మండల వీఆర్ఏలు తమ సమస్యలు నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తమరి ద్వారా తెలపాలని తమ గోడును ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి విన్నవించారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ B. సత్తయ్య కో చైర్మన్ B. రమేష్ జెర్నల్ సెక్రటరీ A. శేఖర్, కన్వినర్ B. శ్రీలత కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

6యుకె01, తెలంగాణ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్ తిప్పడానికి పూలమాలు వేసి నివాళులర్పిస్తున్న మండల వీఆర్ఏ జేఏసీ నాయకులు.
6యుకే02, ఊరుకొండ మండల కేంద్రంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న వీఆర్ఏ జేఏసీ నాయకులు