సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జాజాల చిత్రపటాలకు పాలాభి శేకం చేసిన అంబేద్కర్ సంగ నాయకులు

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 16 జనం సాక్షి.  తెలంగాణ నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పై స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు దీంతో శుక్రవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ చిత్రపటాలకు వారు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, అంబేద్కర్ సంఘం ఎల్లారెడ్డి డివిజన్ ఇంచార్జ్ బిట్ల సురేందర్ మాట్లాడుతూ తెలంగాణలో నిర్మిస్తున్న నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు కేసీఆర్ ఉన్నత భావాలతో ముందుకెళ్లే వ్యక్తిని వారు కొనియాడారు ఇందులో భాగంగానే నూతన సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేయడం జరిగిందన్నారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు గతంలో ఏ నాయకుడు చేయలేని గొప్ప పనులు సీఎం కేసీఆర్ చేస్తున్నాడని వారు తెలిపారు ముఖ్యంగా అంబేద్కర్ను ఇంతగా గుర్తించిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరని వారు అన్నారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు జై భీమ్ అనే నినాదాలతో తమ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో లింగంపేట్ మాజీ ఎంపీపీ సాయిలు , అంబెడ్కర్ సంఘ నాయకులు చెర్ల.సాయిలు,ఎడ్ల.కిషన్, మార్లు సాయిబాబు,పురం రమేష్, పిరంగల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.