సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌లో మార్పు

` 26న నాగర్‌ కర్నూల్‌ సభ రద్దు
` అదే రోజు అచ్చంపేట,వనపర్తి, మునుగోడ సభల ఏర్పాటు
` నవంబర్‌ 9న గజ్వెల్‌, కామారెడ్డిల్లో నామినేషన్‌ దాఖలు
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల పర్యటన,ప్రచార షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌ 15న శంఖారావం పూరించిన బీఆర్‌ఎస్‌ అధినేత నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే అక్టోబర్‌ 26, 27 తేదీలలో నియోజకవర్గాల్లో కేసీఆర్‌ పర్యటన షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. వాస్తవానికి అక్టోబర్‌ 26న అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడులో కేసీఆర్‌ పర్యటించాల్సి ఉంది, కానీ ఆరోజు బీఆర్‌ఎస్‌ అధినేత అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభలలో పాల్గొననున్నారు. నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గంలో కేసీఆర్‌ పర్యటన లేదని పార్టీ స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం కేసీఆర్‌ అక్టోబర్‌ 27న పాలేరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ లలో పర్యటించాల్సి ఉండగా.. పాలేరు, మహబూబాబాద్‌, వర్దన్నపేట కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ సభలలో పాల్గొని ప్రసంగించనున్నారు. స్టేషన్‌ ఘన్‌ పూర్‌ లో వివాదం సద్దుమణగడంతో అక్కడ బదులుగా మహబూబాబాద్‌ తో పాటు వర్దన్నపేటలో బీఆర్‌ఎస్‌ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 15న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడం మొదలుపెట్టిన రోజే హుస్నాబాద్‌ సభతో సీఎం కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించారు. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల ప్రచార షెడ్యూల్‌..ఇలావుంది.26న అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు,  27న పాలేరు, మహబూబాబాద్‌, వర్దన్నపేట 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, 30 ` జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌, 31 ` హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండల సభల్లో పాల్గొంటారు. నవంబర్‌ 1 ` సత్తుపల్లి, ఇల్లెందు,2 ` నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి,3 ` భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల,5 ` కొత్తగూడెం, ఖమ్మం,6 ` గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట,వంబర్‌ 07 ` చెన్నూరు, మంథని, పెద్దపల్లి,8 ` సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, 9 ` గజ్వేల్‌లో మధ్యాహ్నం 1 ` 2 గంటల మధ్య నామినేషన్‌ వేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2` 3 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్‌ రెండోచోట నామినేషన్‌ వేస్తారు. సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్‌ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్‌ తో పాటు మరోవైపు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.
నవంబర్‌ 9న రెండుచోట్ల నామినేషన్లు
సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. నవంబర్‌ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్‌, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్‌ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌
అక్టోబర్‌ 29 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్‌ 30 జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌
అక్టోబర్‌ 31 హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్‌ 01 సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్‌ 02 నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి
నవంబర్‌ 03 భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల
నవంబర్‌ 05 కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్‌ 06 గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట
నవంబర్‌ 07 చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్‌ 08 సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి