సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

పెగడపల్లి,జూలై30(జనంసాక్షి) : పెగడపల్లి మండలం బతికేపెల్లి గ్రామానికి చెందిన బేక్కం భూమయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యం నిమిత్తం చేయుచుకున్న వైద్యంకు ముఖ్యమంత్రి సహాయ నిది నుండి 42000/ చెక్కు మంజూరు అయినది. లబ్దిదారునికి మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కార్యకర్తలు బతుకేపెల్లి గ్రామనికి చెందిన టీ తెరాస పార్టీ మండల ఉపాధ్యక్షులు, అందే వెంకటేశం, బీసీ జిల్లా అధ్యక్షులు కే.గంగాధర్‌, మైనార్టీ మండల అధ్యక్షులు షేక్‌ హైదర్‌( షేకిల్‌ ), నాయకులు స్వర్గం లక్ష్మణ్‌ గంగవ్వ ఆధ్వర్యంలో లబ్దిదారునికి అందజేశారు.