*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత*
పెద్దేముల్ సెప్టెంబర్ 15 (జనం సాక్షి)
సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని పెద్దేముల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన బైండ్ల చంద్రప్పకు రెండు లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కును శ్రీనివాస్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సి.రంగయ్య, రైతుబంధు అధ్యక్షులు కృష్ణ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు డివై ప్రసాద్, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area