సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

హుజూర్ నగర్ సెప్టెంబర్ 20 (జనం సాక్షి): హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో హుజూర్ నగర్ పట్టణంలోని ఏడోవార్డుకు చెందిన వేముల జ్యోతి హాస్పటల్ ఖర్చుల నిమిత్తం మంజూరు కాబడిన 1,25,000 రూపాయల చెక్కును పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, వార్డు అధ్యక్షులు ఉపతల బుచ్చయ్య తో కలిసి బాదిత కుటుంబ సభ్యులకు అందజేశారు. మంగళవారం ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆరోగ్య భరోసాను కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడో వార్డు యూత్ అధ్యక్షులు అమరోజు నాగరాజు, బీసీ సంఘం అధ్యక్షులు బాలరాజు, రామాలయ ధర్మకర్త లక్క వెంకన్న, వల్లెపు రాజు, నరసింహారావు, రామాంజి తదితరులు పాల్గొన్నారు.