సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్య భరోసా

– పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి హుజూర్ నగర్,సెప్టెంబర్ 21 (జనంసాక్షి): సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్య భరోసా అని హుజూర్ నగర్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణంలోని 20 వ వార్డుకు చెందిన కుక్కల మధుబాబు హాస్పటల్ ఖర్చుల నిమిత్తం మంజూరు కాబడిన 32,000 రూపాయల చెక్కును పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, మునిసిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్ రావు, సీనియర్ నాయకులు అట్లూరి హరిబాబు, 13 వార్డు అధ్యక్షులు మీసాల కిరణ్ కుమార్, ఎస్సి కమిటీ అధ్యక్షులు నందిగామ శంభయ్య లు లబ్దిదారునికి అందచేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని ఇప్పటివరకు హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో 10 కోట్ల 21 లక్షల 90 వేల 140 రూపాయలు మన ప్రాంత ప్రజల శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించారని తెలిపారు.